Thursday 14 April 2011

జీలకర మిరియాల రసం

కావలిసినవి :
 టొమాటో  1 - 2
చింత పండు  చిన్నముద్ద
ఎండు మిరపకాయలు    6-7
జీలకర 1  టేబుల్ స్పూన్
మిరియాలు    1 టేబుల్ స్పూన్
కొత్తిమీర కట్ట  1
 కరివేపాకు 3 రెబ్బలు
వెల్లులి 5  రెబ్బలు
నునే  2 టేబుల్ స్పూన్స్
ఆవాలు 1 టీ  స్పూన్

తయారీ :
ముందుగ చింతపండు ఇంకా టొమాటో ని నీళ్ళు  వేసి టొమాటో మీద ముడతలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. (కుకార్  లో రెండు విసిలేస్ వచ్చే వరకు పెట్టుకోవోచు ) చలారిన తరువాత రసం పిండి పెట్టుకోవాలి. ఆ రసం లో పసుపు , ఉప్పు వేసుకోవాలి. తరువాత చిన్న బాండి  పెట్టుకొని జీలకర మరియు మిరియాలు వేయించు కోవాలి (డ్రై  రోస్ట్ ). కొంచం దోరగా వేగిన తరువాత చిన్న రోటి లో వేసుకొని దంచుకోవాలి . ఈ పౌడర్ ని కూడా ఫై న  చేసుకున్న రసం లో వేసుకోవాలి. వెల్లులిని కొద్దిగా నలిగే   లాగా దంచు కొవాలి .

ఒక బాండి లో  నునే వేసుకొని జీలకర , ఆవాలు వేసుకోవాలి. అవి  వేగిన తరువాత దంచిన వెల్లులి  , ఎండు మిర్చి వేసుకోవాలి . ఇవన్ని  బాగా వేగాక కరివేపాకు కొత్తిమెర (కట్ చేసింది) వేసుకొని ఫై న కలుపుకున్న రసం తాలింపు లో వేసుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకుమరిగించు కోవాలి  .

ఇందులో నే ఉడక పెట్టిన  కంది పప్పు వేసుకుంటే ఘుమ ఘుమ లాడే పప్పు  రసం తాయారు అవుతుంది.

ఇంకో వంటకం తో మళ్ళి కలుద్దాము

ఇట్లు,
మమత 














No comments:

Post a Comment